భక్తిశ్రద్ధలతో పడి పూజోత్సవం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బురుజుబండపై వెలసిన కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో పడి పూజోత్సవాన్ని శని వారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని పద్దెనిమిది మెట్లను వివిధ రకాల పుష్పాలు, నేతి దీపాలు, చందన, కుంకుమ, ఫలాలతో తీర్చిదిద్దారు. ఆలయ మేల్‌శాంతి నంబూద్రి నారాయణన్ కేరళ సంప్రదాయ పద్ధతులతో ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు భక్తులను అలరించాయి. పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అయ్యప్ప నామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులకు ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కవితమ్మ, రేణుకమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, అమరనాథ రెడ్డి ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి (ఇన్‌సెట్) పూజల్లో ఎమ్మెల్యే కుటుంబీకులు
ప్రత్యేక అలంకరణలో పడిమెట్లు
భక్తిశ్రద్ధలతో పడి పూజోత్సవం
భక్తిశ్రద్ధలతో పడి పూజోత్సవం


