‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
కదిలించిన సాక్షి కథనాలు
రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశం
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..
ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌక
సదుం : మంత్రులు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములను తక్కువ ధరకే పప్పు బెల్లాల్లా పంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదుం మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పెద్దిరెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఠంచన్‌గా అందించి అన్ని వర్గాలను గత ప్రభుత్వ పాలనలో ఆదుకున్నామని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలుపై కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, పార్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖమ్రుద్దీన్, మస్తాన్, ధనశేఖర్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో బుధవారం క్రిస్మస్ కోలాహలం మొదలైంది. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ మందిరాలు, విశ్వాసుల గృహాలు నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. త్యాగానికి ప్రతీక అయిన క్రిస్మస్ వేడుకను జరుపుకునేందుకు క్రైస్తవులు సన్నద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలకరించారు. చర్చి లోపలి భాగంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల ఏసు జన్మ వృత్తాంతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు క్రైస్తవులు తమ గృహాలను సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి ఏసును స్తుతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్ధనలు నిర్వహించారు. పిల్లలు, యువజనులు క్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించే నాటికలు ప్రదర్శించారు. గురువారం ఉదయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరగనున్నాయి. కాగా క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, చర్చిల అలంకరణ సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
జాన్‌బాస్కో చర్చిలో క్రిస్మస్ ట్రీ
కాణిపాకం : జిల్లాలో జరుగుతున్న స్కానింగ్, అబార్షన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సాక్షి దినపత్రికలో మంగళవారం కన్నింగ్..స్కానింగ్ కథనం ప్రచురితమైంది. అలాగే బుధవారం అబార్షన్ల అనకొండలు పేరిట కథనం వచ్చింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాతో పాటు అక్రమ స్కానింగ్ గుట్టు రట్టు కావాలని ఆదేశించారు. ఏయే జిల్లాలో అక్రమ స్కానింగ్‌లు, అబార్షన్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోని వైద్యులు, ఏఎన్‌ఎంలు దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని హెచ్చరించారు. అక్రమస్కానింగ్‌లు ఏ రకంగా జరుగుతున్నాయి..? వారికి ఎవరెవ్వరూ సహకరిస్తున్నారు..? వారికి ఎంటీపీ కిట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అవి ఎలా సరఫరా జరుగుతున్నాయి? ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? ఆడిట్ జరుగుతోందా అనే విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా అబార్షన్లు, అక్రమ స్కానింగ్‌లు ఆగేనా?.
క్రీస్తు జన్మవృత్తాంతం..
జాన్‌బాస్కో చర్చిలో అలంకరణ
అక్రమ స్కానింగ్,
అబార్షన్లపై ఆగ్రహం
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’


