వేతన.. యాతన
26వ తేదీన మంత్రి ఇంటి వద్దకు చేరుకుని వినతిపత్రం అందజేత
27 నుంచి 28 వరకు ప్రజాప్రతినిధులకు వినతి
29 అన్ని కార్మిక సంఘాలకు లేఖ
30న 12 గంటల దీక్ష
జనవరి 2న రౌండ్ టేబుల్ సమావేశం
3న ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో బ్యానర్ ప్రదర్శన
4న ఆల్ ఇండియా మహాసభ
6న కొవ్వొత్తుల ర్యాలీకి శ్రీకారం
చాలీచాలని జీతాలతో 104 సిబ్బంది అవస్థలు
జిల్లాలో రోడ్డెక్కిన ఉద్యోగులు
అదనపు భారంతో సతమతం
జీతాల్లో కోతలు.. ఆపై వేధింపులు
భగ్గుమంటున్న ఉద్యోగులు
నిరవధిక నిరసనకు శ్రీకారం
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన 104 ఉద్యోగులు
పల్లెల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆపద్బాంధవులకు ఆపదొచ్చింది. 104 అంబులెనన్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాలు తలకిందులవుతున్నాయి. అదనపు భారం కొండెక్కింది. వేధింపులు తార స్థాయికి చేరాయి. ప్రశ్నిస్తే..వేటు వేస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో యాజమాన్యం విడ్డూరంగా వ్యవహరిస్తోంది. వారి పోరు పడలేక ఉద్యోగులు రోడ్డెక్కారు. నిరవధిక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
– చిత్తూరు రూరల్ (కాణిపాకం)
జిల్లాలో 729 గ్రామాలకు గాను ’104’ వాహనాలు కేవలం 42 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉన్నారు. మొత్తం మీద 93 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంది. కానీ ఆ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
వీడని వేధింపులు
సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని ముండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్‌కు డ్యూటీ వేయడం. ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపి రాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ కూడా ఆన్‌లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్‌లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఫార్మసీ పనులు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారానే చేయిస్తున్నారు. ఈ తరణంలో ప్రజలకు జరకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సెలవులు ఏవీ..
కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. వారి బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. వా రు వృద్ధాప్యంలో తరచూ అనారోగ్యం పాలవుతుంటా రు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య ప రిస్థితుల సమయంలో సెలవులివ్వకుండా వేధింపుల కు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగు లు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం క ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల నుంచి కోతలు
గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న ఆరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సీనియర్ల నుంచి నెలకు రూ.800 , జూనియర్ల నుంచి నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో. ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పే వారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడు మూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు సక్రమంగా చెల్లింస్తుందని, అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్‌ఐ, పీఎఫ్ యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు.
నిరసనలు ఇలా...
నిబంధనలకు తూట్లు
భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్ద తలకాయల మద్దతుతో రెచ్చిపోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగనట్టు సమాచారం. గత నాలుగురోజులుగా చేపడుతున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తోందని పలువురు వాపోతున్నారు.
వేతన.. యాతన


