క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్‌ను పురస్కరించుకుని క్రైస్తవులకు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి విడివిడిగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
క్రిస్మస్.. శాంతి నెలకొల్పడమే
చిత్తూరు అర్బన్ : సమాజంలో శాంతి నెలకొల్పడంతో పాటు ప్రతి ఒక్కరిపై కరుణ, సహనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండుగ లక్ష్యమని ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. పరస్పర గౌరవంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మంచి విలువలను పాటించాలని కోరారు.
బీఎల్‌వోల జీతాల పెంపు
చిత్తూరు కలెక్టరేట్ : బీఎల్‌వోల జీతాలను పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు బుధవారం కలెక్టరేట్‌కు అందాయి. జిల్లాలోని బీఎల్‌వోలకు ఇకపై రూ.12 వేలు, బీఎల్‌వో సూపర్‌వైజర్‌లకు రూ.18 వేలు సంవత్సరానికి, స్పెషల్ ఇన్సెంటివ్ ప్రత్యేక డ్రైవ్స్ కార్యక్రమాలకు రూ.2 వేలు చొప్పున అందజేయనున్నారు. పెంచిన జీతాలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి జీతం, పాక్షికంగా పనిచేసిన వారికి అనుబంధంగా చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
వరసిద్ధుడికి
రూ.1.60 కోట్ల ఆదాయం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.1,60,25,165 ఆదాయం వచ్చింది. బంగారం 16 గ్రాములు, వెండి 1.650 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,316, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.25,720 వచ్చింది. యూఎస్‌ఏ 636 డాలర్లు, సింగపూర్ 162 డాలర్స్, మలేషియా 23 రింగిట్స్, యూఏఈ 5 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 370 డాలర్స్ , సౌదీ 185 రియాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, డీఈవోలు సాగర్‌బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
28న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్‌బీ ప్రసాద్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్, ఆల్ చిత్తూరు చెస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పోటీలు ఈ నెల 28 వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఇంటర్‌నేషనల్ స్కూల్ లో జరుగుతాయన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు, ట్రోఫీలు, పతకాలు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27 వ తేదీ లోపు www. apchess.org వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9000475799, 9849313676 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
మాజీ మంత్రి డాక్టర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఎంపీ పెద్దిరెడ్డి
వెంకటమిథున్‌రెడ్డి
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు


