నరసింహపురంలో కోడి పందేల జోరు | - | Sakshi
Sakshi News home page

నరసింహపురంలో కోడి పందేల జోరు

Dec 25 2025 8:33 AM | Updated on Dec 25 2025 8:33 AM

నరసిం

నరసింహపురంలో కోడి పందేల జోరు

పాలసముద్రం : మండలంలోని నరసింహపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో బుధవారం కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు సరిహద్దులో కొన్ని రోజులుగా కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయని చెబుతున్నా రు. తిరుమళరాజుపురం (రైస్‌మిల్‌) కూడలిలో తమిళనాడు వాసులు కోడి పుంజులతో వచ్చి పందేలు ఆడుతున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది యువజనోత్సవాల్లో

ఓవరాల్‌ చాంపియన్‌ ఎస్వీయూ

తిరుపతి సిటీ : దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్‌ అఫైర్స్‌ కోఆర్డినేటర్‌ పత్తిపాటి వివేక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్‌ అఫైర్స్‌ కోఆర్డినేటర్‌ పత్తిపాటి వివేక్‌ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ చెండ్రాయుడు, కల్చరల్‌ అఫైర్స్‌ మాజీ డైరెక్టర్‌ కేఎం భాను, డాక్టర్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 16 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,583 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,936 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.936 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

ఫ్లెమింగో ఫెస్టివల్‌ను

విజయవంతం చేయాలి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశికి

పటిష్ట భద్రత

తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రుల కమిటీలు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్‌ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసినట్లు వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

– ఈ ఏడాది 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా టోకెన్‌ పొందిన భక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే హాజరు కావాలని సూచించారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని తెలిపారు. అదనపు ఎస్పీలు విమనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు పాల్గొన్నారు.

నరసింహపురంలో  కోడి పందేల జోరు
1
1/1

నరసింహపురంలో కోడి పందేల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement