దుప్పి మాంసం..వ్యక్తి అరెస్టు
కార్వేటినగరం : దుప్పి మాంసం ఉందని వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన కార్వేటినగరం అటవీశాఖ కార్యాలయం పరిధిలోని దిగువ గెరిగదొన సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కార్వేటినగరం మండల బిల్లుదొన గ్రామానికి చెందిన దొరస్వామి కుమారుడు శ్రీను, వెదురుకుప్పం మండలం దిగువ గెరిగదొన గ్రామానికి చెందిన రమేష్, హేమసాయి ముగ్గురు కలిసి ఉదయం 11 గంటలకు తమ గ్రామం నుంచి పొలాల వైపు వెళుతున్న సమయంలో పాలదొన బండపై కుక్కలు దుప్పిని వేటాడి మాంసాన్ని తింటున్న సమయంలో అక్కడికి చేరుకుని కుక్కలను ఈ ప్రాంతం నుంచి తరిమి మిగిలిన కేజీ దుప్పి మాంసాన్ని తీసుకుని ముగ్గురు కలసి గ్రామానికి వెళుతున్న సమయంలో అటుగా వెళుతున్న అటవీశాఖ సిబ్బందిని చూసి దుప్పి మాంసాన్ని ముళ్లపొదల్లో వేసి పారిపోవడంతో అనుమానం వచ్చి వారిని వెంటాడి ఒక్కరిని పటుకున్నారు. మరో ఇద్దరు పరారీ కావడంతో అతడిని విచారించగా వెల్లడించిన పేర్లతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో అటవీశాఖ అదుపులో ఉన్న శ్రీనును అరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న రమేష్, హేమసాయి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వన్య ప్రాణులను వేటాడితే అరెస్టు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


