కక్ష సాధింపు చర్య
ఉమ్మడి జిల్లాలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సింహభాగం వైఎస్సార్‌సీపీ వారే. స్థానిక సంస్థల పై కక్ష సాధింపు చర్యకు దిగారు. సర్పంచుల పదవీకాలం దగ్గర పడే సమయంలో కుట్ర పన్నారు. ఆంక్షలు సవరించే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
– శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్
గౌరవం లేదు
గ్రామాల్లో సర్పంచులంటే గౌరవం లేకుండా పోయింది. గ్రామ సభలో చేసిన తీర్మానాలను అమలు చేయడం లేదు. పలు నెలలుగా గౌరవవేతనం ఇవ్వడం లేదు. దీని పై అధికారులను ప్రశ్నిస్తే ఆర్థిక సంఘం నిధులు వచ్చాక ఇస్తామన్నారు. ఇప్పుడు అవి కూడా లేకుండా చేశారు. – రజనీకాంత్, సర్పంచ్,
వసంతాపురం గుడిపాల మండలం
అభివృద్ధి బిల్లులు ఆపేస్తారా?
పంచాయతీ అభివృద్ధి కోసం పనులు చేపడితే నిధులు ఇవ్వరాదని హుకుం జారీ చేయడం దారుణంగా ఉంది. పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు మంజూరులో జాప్యం చేయడం కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదు.
– ధనుంజయవర్మ, సర్పంచ్, కార్వేటినగరం
కక్ష సాధింపు చర్య
కక్ష సాధింపు చర్య


