ప్రాణం తీసిన అతివేగం!
● బైక్‌ను ఢీకొన్న కారు ● వ్యక్తి మృతి ● ఏ.కొత్తకోట వద్ద ఘటన
చౌడేపల్లె: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం ఏ.కొత్తకోట వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. పుంగనూరు– దాదేపల్లె క్రాసు మధ్యలోని ఏ.కొత్తకోట గ్రామ శివాలయం ముందుగల మలుపు వద్ద అదే గ్రామానికి చెందిన కుమ్మరి వెంకట్రామయ్య(61) బైక్‌లో దాదేపల్లె వైపునకు బయలుదేరాడు. ఇదే మార్గంలో ఎదురుగా మేకలచిన్నేపల్లెకు చెందిన ఓ కారు అతివేగంగా వస్తూ బైక్‌ను ఢీకొట్టి ఆమడదూరం లాక్కొని వెళ్లింది. బైక్ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో వెంకట్రామయ్యకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు.
గొర్రెల దొంగలు అరెస్ట్
కుప్పంరూరల్: కుప్పం ప్రాంతంలో పలు చోట్ల గొర్రెల దొంగతనానికి పాల్పడిని తమిళనాడుకు చెందిన నలుగురు దొంగలను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. డిసెంబర్ 5వ తేదీ చందం పంచాయతీ, అబ్బకుంటకు చెందిన రామప్ప గొర్రెలను దొంగతనం చేసేందుకు తమిళనాడు రాష్ట్రం కందికుప్పంకు చెందిన అబ్దుల్ మాలిక్, సాదుల్లా, అరవింద్‌కుమార్, యూరబ్ మహమ్మద్ రాత్రి టవేరా వాహనంలో వచ్చారు. రామప్పకొటంలోని గొర్రెలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అలజడి రావడంతో రామప్ప బయటికి వచ్చి దొంగలు దొంగలు.. అంటూ కేకలు వేశాడు. కేకలు విన్న దొంగలు పారిపోయేందుకు టవేరా వాహనం ఎక్కి కుప్పం వైపు వెళ్లారు. రామప్ప, అతని కుమారుడు కుమార్ దొంగలను వెంబడించారు. తీరా అర్చనా గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద దొంగలకు అడ్డుగా వచ్చి టవేరా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, వారు రామప్పపై కత్తులతో దాడికి యత్నించారు. ఈ దాడిలో రామప్పకు రక్తగాయాలయ్యాయి. రామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుప్పం అర్బన్ నేతృత్వంలోని ప్రత్యేక టీం ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రణాళిక రచించింది. తీరా దొంగలు బుధవారం రాత్రి మరో దొంగతనం చేసేందుకు కుప్పం రాగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
కారు ఢీకొనడంతో మృతిచెందిన వెంకట్రామయ్య, నుజ్జునుజ్జు అయిన బైక్
ప్రాణం తీసిన అతివేగం!
ప్రాణం తీసిన అతివేగం!


