వైభవంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతన ఆంగ్ల సవత్సరం వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించగా అప్పటికే వేచిఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేయించారు.
కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని జిల్లా అధికారులు, పలువురు ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ చైర్మన్ కట్టమంచి బాబి, పలు శాఖల అధికారులు వెంకటరమణ, శ్రీదేవి, రవికుమార్ నాయుడు, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, అలాగే ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్‌కుమార్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్, సెక్రటరీ కాళేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
సమష్టిగా పనిచేద్దాం
చిత్తూరు అర్బన్: కొత్త ఏడాది.. సరికొత్త సవాళ్లతో అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని చిత్తూరు తుషార్ డూడీ అన్నారు. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని గురువారం చిత్తూరు నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రం, క్యాంపు కార్యాలయం, అనాథ–వృద్ధాశ్రమాల్లో ఎస్పీ నూతన సంతవ్సర వేడుకలు నిర్వహించారు. డూడీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం హోంగార్డు నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు పోలీసు ఉద్యోగం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. శిక్షణ ఐపీఎస్ అధికారి తరుణ్, ఏఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు.
మూడు రోజులుగా సందడే.. సందడి
తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వరుస పర్వదినాలు రావడంతో మూడు రోజులుగా భక్తులు సందడి నెలకొంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్లసంవత్స రాది సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు అధికంగా అధికసంఖ్యలో తరలివచ్చారు. కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తుమ్మ లగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని కల్యాణ మండపంలో నిర్వహించిన అఖండ భజన భక్తులను ఆకట్టుకుంది.
వైభవంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు
వైభవంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు


