అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు
సదుం: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మండలంలోని కోటమలై అయ్యప్పస్వామి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. క్యూల్లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అలంకరించారు. భక్తుల రద్దీని ఎన్‌సీసీ విద్యార్థులు క్రమబద్ధీకరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిలో వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసు సిబ్బంది తగినంత మేర లేకపోవడంతో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మండల కేంద్రమైన సదుంలోనూ ట్రాఫిక్ అవస్థలు తప్పలేదు. కొత్తపల్లె శ్రీవారిపాద క్షేత్రం, సదుం సాయి మందిరంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రత్యేక అలంకరణలో అయ్యప్పస్వామి, ఎర్రాతివారిపల్లె మార్గంలో ట్రాఫిక్ జామ్
అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు


