వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం
రొంపిచెర్ల: వీఆర్‌ఏల సమస్యలను పరిష్కారిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. గురువారం రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు మంత్రినికి కలశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్కాయం జరుగుతుందన్నారు. వీఆర్‌ఏలకు జీతాల పెంపు, ప్రమోషన్లు, నామినీ సమస్యలను ఈనె 8న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలో వీఆర్‌ఏలకు శుభవార్త చెప్తామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్‌ను, సీసీఎల్‌ఏ అధికారి జయలక్ష్మిని సత్కరించారు. యూని యన్ నాయకులు నరేష్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
ప్రసన్నుడి సేవలో
హైకోర్టు న్యాయమూర్తి
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామిని గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆల య అర్చకులు ఆశ్వీరవచనం చేశారు. ఆయల అధికారి వేణుగోపాల్ దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిర్ణీత సమయంలో
శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా 70,256 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,102 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.
నూతన సంవత్సర
వేడుకల్లో విషాదం
తమిళనాడు విద్యార్థి మృతి
పుత్తూరు: నూతన సంవత్సర వేడు కలు ఓకుటుంబంలో పెను విషాదా న్ని నింపాయి. తన తో వచ్చిన తమ్ము డు సోము(16) ఇక లేడ ని తెలుసుకొన్న అన్న బద్రీతో పాటు సహచరులు విషాదంలో మునిగిపోయారు. పుత్తూరు మండలం, పరమేశ్వరమంగళం గ్రామం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఫ్లస్‌వన్ చదివే సోము అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. సహచరుల కథనం.. తమిళనాడు రాష్ట్రం, పళ్లిపట్టు తాలూకా, కేశవరాజుకుప్పం గ్రామానికి చెందిన 20 మంది యువ కులు కొత్త ఏడాదిని నారాయణవనం మండలంలోని కై లాసకోన జలపాతంలో జరుపుకోవడానికి గురువారం ఉదయం మోటర్ సైకిళ్లపై వచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేసి సరదాగా గడిపిన అందరూ సాయంత్రం 4గంటలకు గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో మనోహరం, తులసీరాం, సోము ముగ్గురూ ఒక బైక్‌పై బయలుదేరారు. పరమేశ్వరమంగళం గ్రామం వద్ద బైక్ షడన్ బ్రేక్ వేయడంతో వెనక కూర్చొన్న సోము ఎగిరి కిందపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా నగరి నుంచి పుత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సోము అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు.
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం


