● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● డీఎంహెచ్‌ఓ సుధారా
అక్రమ స్కానింగ్‌లు,
అబార్షన్లు చేస్తే కటకటాలే
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చట్టానికి విరుద్ధంగా అక్రమ స్కానింగ్‌లు, అబార్షన్లు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఎంహెచ్‌ఓ సుధా రాణి మండి పడ్డారు. సాక్షి దినపత్రికలో వీటిపై వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. కన్నింగ్ స్కానింగ్, అబార్షన్ల అనకొండలు, డెమో డమ్మీ అంటూ వరుస కథనాలతో వైద్య ఆరోగ్యశా ఖ అధికారులను కదిలించాయి. ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేశారు. అక్రమ స్కానింగ్‌పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని, రికార్డులు సక్రమంగా నిర్వర్తించని సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆర్‌ఎంపీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అక్రమ అబార్షన్లకు పా ల్పడితే వైద్యులు, వారికి సహకరించే వ్యక్తుల ను జైలుకు పంపుతామని హెచ్చరించారు. అబార్షన్లు, అక్రమ స్కానింగ్‌లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు.
నేడు విద్యుత్ బిల్ కేంద్రాలు పనిచేస్తాయ్
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు అందుబాటులో ఉంటాయని ఎస్‌ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు సెలవు రోజున కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వీరితో పాటు హెచ్‌టీ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని కోరారు.
30న జెడ్పీ స్టాండింగ్ కమిటీ
చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలు అయిన ఆర్థిక, ప్రణాళిక, పను లు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాలపై చర్చ ఉంటుందన్నారు.


