నిర్లక్ష్యం..నిరుపయోగం
అరగొండ బాలికోన్నత
పాఠశాలలో సమస్యల తిష్ట
అరగొండలో నిరుపయోగంగా ఉన్న బాలికల హైస్కూల్ అదనపు తరగతి గదులు, ఆట స్థలంలో పిచ్చిమొక్కలు
తవణంపల్లె: మండలంలోని అరగొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ 193 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్‌లో 20 మందిదాకా చదువుతున్నారు. హైస్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. నీటి సరఫరా సైతం సక్రమంగా లేదు. 20 ఏళ్ల క్రితం జెడ్పీ నిధులతో నిర్మించిన మూడు తరగతి గదులు, ఆట స్థలం, మరుగు దొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీటి చుట్టూ ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి.
రోడ్డు దాటలేకనే..
అరగొండ బాలికోన్నత పాఠశాలకు రెండు ప్రదేశా ల్లో సుమారు 200 మీటర్ల దూరంలో అదనపు తరగతి గదులు నిర్మించారు. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే ప్రదేశంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరోచోట ఉన్న తరగతి గదులకు రాకపోకలకు రోడ్డును దాటి వెళ్లాల్సి ఉంది. దీంతో అటువైపు ఎవ్వరూ వెళ్లడం లేదు.
గతంలో నుంచే నిరుపయోగం
నేను హెచ్‌ఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతోంది. అంతకుముందు నుంచే మూడు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆట స్థలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఆట స్థలాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు చేపడుతాం. మౌలిక వసతులు కల్పిస్తే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తా.
– మోహన్‌రెడ్డి, హెచ్‌ఎం,
అరగొండ బాలికోన్నత పాఠశాల
నిర్లక్ష్యం..నిరుపయోగం


