ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

ప్రపం

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌

తిరుపతి సిటీ: ప్రపంచ దేశాలకు భారత్‌ దిక్సూచిగా నిలిచి ప్రశంసలు పొందుతోందని వక్తలు కొనియాడారు. జాతీ య సంస్కృత యూనివర్సిటీలో శుక్రవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల న చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్‌ గొప్పతనం, సాంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానాన్ని, లక్ష్యాలను, ప్రగతిని చాటి చెప్పేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరుసార్లు భారతీయ విజ్ఞాన సమ్మేళం నిర్వహించామని, తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత తొలిసారి సమ్మేళనం నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ సందర్భగా సమ్మేళానికి హాజరైన సీఎం, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, అతిథులను వర్సిటీ అధికారులు ఘనంగా సన్మానించారు. తరువాత సమ్మేళనంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించి అభినందించారు. కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావంతో ఎన్‌ఎస్‌యూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనానికి సుమారు 1,250 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. భారత్‌ ఔనత్యాన్ని చాటిచెప్పేలా పలు అంశాలపై వారు ఈ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సమ్మేళనం ప్రారంభం అనంతరం వర్సిటీలోని చెలికాని అన్నారావు భవన్‌లో ఎన్‌ఎస్‌ఏబీ సభ్యులు, మాజీ డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారత్‌ విజ్ఞాన్‌ సమ్మేళనంపై ప్రత్యేక ప్లీనరీ సెషన్‌ నిర్వహించారు. అనంతరం డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ చంద్రిక కౌషిక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు పాఠాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

విజ్ఞాన సమ్మేళనాన్ని తప్పక వీక్షించాలి

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని విద్యార్థులు తప్పక వీక్షించాలని డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో ప్రారంభభమైన కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మేళనంలో ఎగ్జిబిషన్‌ స్టాళ్లు, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, ఇవి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృష్టిని మరింత పెంపొందించేలా ఉన్నాయని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల నుంచి ప్రతిరోజు 3 వేల మంది విద్యార్థులు, వారితోపాటు ఉపాధ్యాయులు, సందర్శించడానికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ ప్రదర్శనను వీక్షించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌ 1
1/3

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌ 2
2/3

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌ 3
3/3

ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement