అలరించి..ఆలోచింపజేసి!
సదుం: ఓ చిన్నారి ముద్దులొలికే మాటలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఆలపించిన గీతం సోషయల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు. పాలమందలో పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుడు విజయరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుమార్తె భువిక్షరెడ్డి పెద్దిరెడ్డిపై ఓ గీతాన్ని ఆలపించారు. ఆయన ప్రజలకు అండగా ఉంటారని.. అయ్యప్ప ఆలయాన్ని కట్టించారంటూ అందరినీ ఆలరించేలా ఆలపించారు. ఆ చిన్నారిని పెద్దిరెడ్డి ఆప్యాయంగా అభినందించారు. ఈ గీతాన్ని సోషయల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ చిన్నారి కలికిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతోంది.
మద్యం సీజ్
– ఇద్దరి అరెస్ట్
పుంగనూరు: చట్ట వ్యతిరేకంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కెవి.రమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఐ సుబ్బరాయుడుకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. పట్టణ సమీపంలో నక్కబండలో కేశవ అనే వ్యక్తి తన చిల్లర అంగడిలో మద్యాన్ని పెట్టుకుని విక్రయిస్తున్నట్టు తెలిసి దాడులు నిర్వహించామన్నారు. అలాగే ఈడిగపల్లె సమీపంలోని శక్తి డాబా వెనుక నుంచి శ్రీనివాసులు అనే వ్యక్తి మద్యాన్ని సరఫరా చేస్తుండగా అతనిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిద్దరి వద్ద నుంచి 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, ఇరువురునీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.
అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రత్యక్ష ప్రోద్భలంతోనే మత ప్రచారం, బలవంతపు ప్రార్థనలు, వసతి గృహంలో మత మార్పిడులు, బయట వ్యక్తుల ప్రవేశం జరుగుతోందన్నారు. దీనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలరించి..ఆలోచింపజేసి!


