ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి
పుంగనూరు: తప్పుడు కేసులు, భూదోపిడీలు, భూ కబ్జాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా కొత్తపల్లె వద్ద ఆయన వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఐటీ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భాస్కర్, రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌పూసపాటి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయపాల్, జాయింట్ సెక్రటరీ వేణు, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివ, ఉపాధ్యక్షులు ప్రవీన్, జయచంద్ర, ఉమ్మడి జిల్లాల ఐటీవింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, పార్టీ జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డితో పలు విషయాలపై చర్చించారు. టీడీపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, తప్పుడు కేసులు, భూకబ్జాలు, దోపిడీల పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనపై కూడా ప్రజలకు అవగాహన కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు.


