వదిలేశారా? | - | Sakshi
Sakshi News home page

వదిలేశారా?

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

వదిలేశారా?

వదిలేశారా?

ఆ శాఖలో వసూళ్ల దుమారం అడ్డొచ్చిన వారిపై బదిలీ వేటు స్కెచ్‌ వేసి ఇద్దరి జీఎంలను సాగనంపిన వైనం కలెక్షన్‌ కింగ్‌ల మాటేంటో?

మైనింగ్‌ శాఖలో వసూళ్ల దందా దుమారం రేపుతోంది. సర్వం సత్యం జగత్‌ మయవుతోంది. కాసులు కురిపించేవారిని అందలం ఎక్కిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు జీఎంలపై బదిలీ వేటు పడింది. ఇక్కడే ఏళ్లుగా పాతకుపోయిన కలెక్షన్‌ కింగ్‌లను మాత్రం అలాగే వదిలేశారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో 400 క్వారీలున్నాయి. వీటిలో ప్రస్తుతం 150పైగా నడుస్తున్నాయి. అక్రమంగా 140 వరకు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, వెదురుకుప్పం, గుడిపాల మండలాల్లో ఈ అక్రమ క్వారీలు పుంజకుంటున్నాయి. వీటి నుంచి కోట్ల విలువ చేసే గ్రానైట్‌ దిమ్మెలు సరిహద్దులు దాటుతున్నాయి. అయినా పట్టించుకునే వారు కరువుతున్నారు.

జిల్లాలో ప్రధానంగా అక్రమ మైనింగ్‌ పుంజుకుంటోంది. కొందరు కూటమి నేతలు ఇసుక, మట్టి, గ్రానైట్‌ విచ్చలవిడిగా తవ్వేసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. అక్రమ మూలాలు నేర్పించి రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటున్నారు. అనుమతులు లేకుండా క్వారీలు తవ్వుకోవడం, తప్పుడు పత్రాలతో గ్రానైట్‌కు అనుమతులు ఉన్నాయని చెప్పడం, తవ్విన గ్రానైట్‌ దిమ్మెలను కొలతలు వేసి జిల్లాతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయించేకునేలా చేయడం, సరిహద్దులు దాటించడం, అక్రమ క్వారీలను పట్టుకుంటే.. బండి వదిలి పెట్టేలా చేయించడం, దొంగ బిల్లులు ఇవ్వడం, సంఘం పేరుతో బిల్లులు ఇప్పించడం, పోలీసులు, విజిలెన్స్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌, సేల్స్‌ ట్యాక్స్‌ వారు టచ్‌ చేయకుండా కంటి రెప్పలా కాపాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్త దరఖాస్తులు వస్తే.. పిండుకుంటున్నారనే ఆరోపణులున్నాయి. స్కెచ్‌ గీస్తే ఒక రేటు, ఫైల్‌లో సంతకం పెడితే మరో రేటు, బండి కదలలాంటే ఇంకో రేట్‌ ఫిక్స్‌ చేసి దండుకుంటున్నట్టు సమాచారం. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఓ అధికారి అంటకాగుతున్న వారిని అంటిపెట్టుకుని ఈ దందా నడిపిస్తున్నారని ఆ శాఖలోని పలువురు చర్చించుకుంటున్నారు.

జిల్లాలో అక్రమ క్వారీల నిర్వహణలో ఓ ద్వితీయ స్థాయి అధికారి పాత్ర అంత్యత కీలకమని తెరపైకి వచ్చింది. సాక్షిలో వచ్చిన వరుస కథనాలకు ఆ అధికారిపై విచారణ కూడా జరిగింది. విజిలెన్స్‌ అధికారులు కూడా జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు సమర్పించుకున్నారు. ఆపై సీఎంఓ ఆఫీసు నుంచి విచారణ కూడా జరిగింది. ఈ దెబ్బతో కొన్ని అక్రమ గనులు మూసుకున్నాయి. కానీ ఓ అధికారి అక్రమాలకు అడొచ్చిన వారిపై పగబట్టారు. తమకు సహకరించకుండా..ప్రశ్నించే గొంతుపై కత్తి పెట్టారు. పలమనేరు, చిత్తూరు జీఎంలపై బదిలీ వేటు వేయించారు. ఈ బదిలీ వెనుక ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారని ఆ శాఖలోని అధికారులు చర్చించుకుంటున్నారు. కానీ పైసా వసూల్‌ పైచేయిగా ఉన్న అధికారిని మాత్రం వదిలిపెట్టేశారు. దీనిపై ఓ వర్గంలోని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. మళ్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పుకొస్తున్నారు. కాగా త్వరలో జిల్లా శాఖలో మరో ఇద్దరిపై బదిలీ వేటు పడనుందని సమాచారం.

జిల్లా మైనింగ్‌శాఖలో సత్యం జగత్‌

వసూళ్ల సీన్‌

ఇదీ జరుగుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement