యూరియా..లేదయ?
రైతు సమాఖ్య సెంటర్లు, ఆర్‌ఎస్‌కేలకు వచ్చిన యూరియా ఖాళీ
బస్తా యూరియా కోసం క్యూలు
కర్ణాటకలోనూ అంతంతే
బ్లాక్‌లో విచ్చలవిడిగా విక్రయాలు
గతంలో రైతుల చెంతకే ఆర్‌బీకేల్లో కావాల్సినంత యూరియా
రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా కావాల్సినంత యూరియా దొరికేది. సకాలంలో పంటలకు వేసుకునేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే అరకొర యూరియా ఎక్కడికీ చాలడం లేదు. ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్‌ఎస్‌కేలు.. ఫర్టిలైజర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ.. అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పలమనేరులోని రైతు సమాఖ్య సెంటర్, గ్రోమార్ దుకాణాల వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులు (ఫైల్)
బ్లాక్‌లో బస్తా యూరియా రూ.500 పైమాటే
స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకలో యూరియాను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆటో డ్రైవర్లకు ఇది బాగా కలిసి వస్తోంది. నిత్యం బోర్డర్‌కు వెళ్లడం.. పది బస్తాలను ఆటోలో తెచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. కర్ణాటకలో బస్తా యూరియా ధర రూ.270 కాగా అది బ్లాక్‌లో రూ.500 దాటుతోంది.
ఎరువుల దుకాణాల్లో నోస్టాక్
జిల్లాలోని ఎరువుల దుకాల్లో యూరియా స్టాకు లేదు. వీరికి హోల్‌సేల్‌గా సరఫరాచేసే ఏజెన్సీలు యూరియా కావాలంటే కాంప్లెక్స్ తీసుకోవాలంటూ మెలిక పెట్టాయి. దీంతోపాటు ఇక్కడ ఎమ్మార్పీ రూ.275కి విక్రయించాల్సి ఉండగా..ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీలు అదనంగా ఉంటున్నాయి. దీంతో బస్తా రూ.300పైగా విక్రయించాలి. లేని సమస్యలకెందుకని ఫర్టిలైజర్స్ యూరియాను అసలు కొనడం లేదు. దీనికితోడు ప్రభుత్వం సైతం ఆర్‌ఎస్‌కేలు, రైతు సమాఖ్య, గ్రోమార్ సెంటర్లకు మాత్రమే యూరియాను పంపుతోంది.
పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతు న్న కష్టాలు అన్నీఇన్నీకావు. మొన్నటి దాకా కాంప్లెక్స్ లేదా ఫర్టిలైజర్స్ కొంటేనే యూరియా అమ్మిన ఎరువుల దుకాణదారులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్‌సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్‌గా అందే జిల్లాలోని గ్రామోర్ అవుట్‌లెట్లు, రైతు సమాఖ్య దుకా ణాలకు వందలాది మంది రైతులు క్యూకడుతున్నారు. వారిని నియంత్రించేందకు పోలీసు బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారుమళ్లకు సైతం యూరియా దొరకడం లేదు. ఏపీ రైతుల దెబ్బ కు పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం స్టాకు లేకుండా పోయింది. ఉన్న స్టాకును కొందరు బ్లాక్ మార్కెట్లోకి తరలించి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల్లో కావాల్సినంత యూరియా దొరగ్గా కూటమి పాలనలో మాత్రం ఎందుకు యూరియాకు డిమాండ్ వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అక్కడా యూరియా లేదు
జిల్లాలో యూరియా దొరక్క రైతులు పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది.
భారీగా పెరిగిన వరి సాగు
జిల్లాలో గత ఖరీఫ్‌లోనూ వరిసాగు పెరిగింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దీంతో సాధారణ వరిసాగు ఈ రబీలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నారుమళ్ల సీజన్ నడుస్తోంది. దీంతోపాటు మొక్కజొన్న, పశుగ్రాసం, మల్బరీ పంటలకు సైతం రైతులు యూరియాను వాడుతున్నారు. జిల్లాలో డిమాండ్ మేరకు యూరియా అలాట్‌మెంట్ మాత్రం పెరగడం లేదు.
గంటల్లో ఖాళీ
ఇటీవల జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో ఒక్కో పంచాయతీకి రూ.250 బస్తాల యూరియా వచ్చింది. ఇది కేవలం గంటల్లో ఖాళీ అయిపోయింది. ఇందులో సింహభాగం కూటమి నేతలకే చేరిపోయింది. ఫలితంగా అవరసమైన రైతులు బ్లాక్‌లో కర్ణాటక నుంచి అధిక ధరతో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
జిల్లా సమాచారం
జిల్లాలో యూరియా నో స్టాక్
దొరకలేదు
ఓ బస్తా యూరియా కోసం వారం రోజులుగా పలమనేరు లోని దుకాణాల వద్దకు తిరు గుతున్నా. కానీ ఫలితం లేదు. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అన్నా ఇప్పుడు యూరియా దొరకడం లేదు. మా బంధువుల ద్వారా కర్ణాటకలోని వడ్డిపల్లికెళ్లి బస్తా యూరియా తెచ్చుకున్నా.
– సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం
యూరియా..లేదయ?
యూరియా..లేదయ?
యూరియా..లేదయ?
యూరియా..లేదయ?


