అనుభవించక తప్పదు
చేసిన పాపాలు
సోమల(సదుం): కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను భవిష్యత్‌లో అనుభవించక తప్పదని, బాబు నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. సోమల మండలంలో గురువారం వారు విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన నాయ కులు చేసిన తప్పిదాలు, అరాచకాలను సైతం వైఎస్సార్ సీపీపై నెట్టేసి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. చేసిన పాపాలను రానున్న రోజుల్లో అనుభవించక తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రస్తుతం నిలిపివేశారని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యం, విద్యను దూరం చేసే ఈ విధానంపై ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు.
మైనారిటీల సంక్షేమానికి కృషి
సోమల: ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మైనారిటీలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఎంపీ
మైనారిటీలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే, ఎంపీ తెలిపారు. సోమల ఈద్గా వద్ద మైనారిటీలతో సమావేశం నిర్వహించారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ ఈశ్వరయ్య, నాయకులు అమాసమోహన్, గంగాధర్‌రాయల్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సరస్వతమ్మ, వైస్ ఎంపీపీలు ప్రభాకర్, సయ్యద్‌బాషా, కల్యాణ భరత్, దామోదరరాజు పాల్గొన్నారు.
అనుభవించక తప్పదు


