ఘనంగా హనుమాన్ చాలీసా
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో గురువారం హనుమాన్ చాలీసాను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకీర్తనలు, భజనల తో భక్తులను హోలలాడించారు. కార్యక్రమాని కి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


