కిస్మస్ వేడుకల్లో కలెక్టర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం,కొంగారెడ్డిపల్లిలోని బీటీ మెమోరియల్ చర్చి లో గురువారం జరిగిన కిస్మస్ వేడుకల్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నా రు. కాసేపు దైవ సందేశాన్ని ఆలకించారు. అనంతరం చర్చి పాస్టర్లు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తర్వాత శాలువతో సత్కరించారు.
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం సెలవు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ ఆవరణంలో కూడా భక్తజన సందడి కనిపించింది. భక్తుల తాకిడితో దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులకు స్వామి దర్శనం కల్పించారు.
రేపు పడిమెట్ల పూజోత్సవం
సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం పడిమెట్ల పూజోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో ప్రాముఖ్యత కలిగిన పడిమెట్ల పూజోత్సవాన్ని ఆలయ ధర్మకర్త, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విశేషంగా తరలివచ్చే స్వాములు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కిస్మస్ వేడుకల్లో కలెక్టర్
కిస్మస్ వేడుకల్లో కలెక్టర్


