సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నల్లరాళ్లపల్లై గంగమ్మ గుడి సీసీ రోడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని.. అసంతృప్తితో ఉన్నారన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన ఉచిత హామీలు నమ్మిన ప్రజలు.. ఓట్లు వేసి మోసపోయారు. అబద్ధపు హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ ఐదేళ్లు పాలన ఎలా ఉంది, చంద్రబాబు ఏడాదిన్నర పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. చంద్రబాబు వైఫల్యాలే వైఎస్సార్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది. కూటమి ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తోంది. మేం వచ్చాక అన్నీ సరిచేస్తాం’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.


