ముక్కోటికి ముస్తాబు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేకించి వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలు, చలువ పందిళ్లు, రంగవల్లులు, విద్యుత్‌దీపాలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం వేకువ జాము 12–05 గంటలకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొల్పి, ధనుర్మాస కై ంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 1.35 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి వైకుంఠ ద్వారం గుండా అనుమతించనున్నారు. సాయంత్రం 4గంటలకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 31 బుధవారం వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నాన్నం నిర్వహించనున్నారు.
విద్యుత్ దీపకాంతులతో అలరారుతున్న ప్రసన్నుడి ఆలయం
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు


