ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో జరుగుతున్న ఆర్‌డీఎస్‌ఎస్ పను లు వేగవంతం చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్మా ణ, ఎంఆర్‌టీ, డీపీఈ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పల్లెలకు త్రీఫేజ్ సరఫరా ఇవ్వడానికి ఈ పథకం కేంద్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిందన్నారు. దీంతో గ్రామాలకు మెరుగైన సరఫరా ఇవ్వడమే లక్ష్యమన్నారు. జిల్లా లో మార్చి నాటికి 421 ఫీడర్ల పరంగా పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 174 మాత్రమే చేశారన్నారు. మిగిలినవి యుద్ధప్రాతిపాదికన చేయాలని ఆదేశించారు. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు వాణిజ్య సర్వీసులకు బిగించడం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పా టు చేస్తున్నామన్నారు. తదుపరి ప్రభుత్వ ఉద్యోగు ల నివాసాలకు చివరిగా మిగిలిన సర్వీసులకు స్మార్ట్ మీటర్లను పెట్టాలన్నారు. నగరి, కార్వేటినగర వినియోగదారులు చిత్తూరుకు రావడం ఎందుకన్నారు. కార్యక్రమంలో ఈఈలు హరి, భాస్కర్‌నాయుడు, రవి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.


