నాడి పట్టని వైద్యులు | - | Sakshi
Sakshi News home page

నాడి పట్టని వైద్యులు

Jan 3 2026 7:07 AM | Updated on Jan 3 2026 7:07 AM

నాడి

నాడి పట్టని వైద్యులు

పల్లె వైద్యానికి సుస్తీ విజిట్‌ పేరుతో విధులకు డుమ్మా స్టాఫ్‌నర్సులే..డాక్టర్ల అవతారం మొక్కుబడి వైద్యంతో అవస్థలు పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

ప్రాథమిక ఆరోగ్యానికి సుస్తీ చేసింది. వైద్యులు నాడి పట్టకలేకపోతున్నారు. ఓపీకి..ఓపిక లేదంటున్నారు. విజిట్‌ పేరుతో విధులకు డుమ్మాకొడుతున్నారు. స్టాఫ్‌నర్సులే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఓపీ సంఖ్య దారుణంగా పడిపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూగబోతున్నా యి. ఆరోగ్య సేవలపై కలెక్టర్‌ సీరియస్‌ అవుతున్నారు.

గుడిపాలలో

చికిత్స అందిస్తున్న స్టాఫ్‌నర్సులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 15యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రోజువారీగా 50 నుంచి 120 ఓపీలొస్తున్నా యి. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ మంది పేద లే. అందులో అధికంగా వృద్ధులుంటున్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరోగ్య సేవలు ఆమడ దూరమయ్యాయని పేద లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాడితప్పిన సేవలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా గాడితప్పాయి. పర్యవేక్షణ లోపం కారణంగా డాక్టర్లు కనుమరుగవుతున్నారు. చెప్పాపెట్టకుండా డుమ్మాకొట్టేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు హాజరై..ఫేషియల్‌ అటెండన్స్‌ పెట్టాలి. కానీ చాలా మంది సమయానికి అటెండన్స్‌ వేయడం లేదు. సాయంత్రం హాజరు ఊసే కనిపించడం లేదు. డాక్టర్లు విజిట్‌ పేరుతో తప్పించుకుని తిరుగుతున్నారు. సొంత వైద్యానికి పదును పెడుతున్నారు.

విజిట్‌..వ్యసనంలా..!

విజిట్‌ అనే పదాన్ని పలువురు వైద్యులు వ్యసనంలా మార్చేశారు. మూమెంట్‌, విజిట్‌ రిజిస్ట్రర్‌లను చూపించి...పలువురు వైద్యులు వైద్య సేవలను గాలిలో దీపంలా చేశారు. డాక్టర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధిగా ఓపీ చూడాలి. కానీ ఆ రకంగా వైద్యులు ఓపీ చూడడంలేదు. ఆ సీట్లో కూర్చొనే ఓపిక లేకుండా పోతోంది. విజిట్‌ పేరుతో విధులకు స్వస్తి పలుకుతున్నారు. ఏదో ఒక చోట పరిశీలనకు వెళ్లినట్టు నోట్‌ క్యామ్‌ ద్వారా ఫొటోలు పెట్టి...సొంత పనులకు పరుగులు పెడుతున్నారు. లేకుంటే డీఎంహెచ్‌ఓ ఆఫీసులో మీటింగ్‌ అంటూ విధులను వదిలించుకుంటున్నారు. ఇద్దరు డాక్టర్లుంటే ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోకుండా ..మరో వైపు 104 సేవలను కూడా నీరుగారుస్తున్నారు.

స్టాఫ్‌నర్సులే అన్నీ తామై..

డాక్టర్లు లేని పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సులే డాక్టర్లవుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వైద్యులకు వారు వైద్యం చూసి పంపుతున్నారు. జబ్బు అడిగి..మందులు, మాత్రలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటున్నారు. స్టాఫ్‌ నర్సులే పీహెచ్‌సీలో అన్ని తామై వ్యవహరిస్తున్నారు. ఒక వేళ డాక్టర్లు ఉన్నా కొన్ని చోట్ల స్టాఫ్‌ నర్సుల ద్వారా చికిత్స చేయిస్తున్నారు. దీంతో వైద్య సేవలు పూర్తిగా గాడితప్పుతున్నాయి.

నాడి పట్టని వైద్యులు 
1
1/1

నాడి పట్టని వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement