సేవల తీరు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

సేవల తీరు ఇలా..

Jan 3 2026 7:07 AM | Updated on Jan 3 2026 7:07 AM

సేవల తీరు ఇలా..

సేవల తీరు ఇలా..

– IIలో

గంగమ్మకు రాహుకాల పూజలు
బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు.

గుడిపాల మండలంలోని పీహెచ్‌సీని శుక్రవారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఇద్దరు డాక్టర్లు లేరని, స్టాఫ్‌ నర్సులే చికిత్స అందిస్తున్నారని గుర్తించారు. ఒక డాక్టర్‌ మెడికల్‌ లీవులో వెళ్లగా..మరో డాక్టర్‌ విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుసుకున్నారు. దీంతో కలెక్టర్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.

చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట ఆస్పత్రిలో శుక్రవారం వైద్యుల కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా..ఒక డాక్టర్‌ మెటర్నటీ లీవులో ఉన్నారు. మరో డాక్టర్‌ విజిట్‌కు వెళ్లారు. ఆ డాక్టర్‌ చెర్లోపల్లిలో విజిట్‌కు వెళ్లినట్లు నోట్‌క్యామ్‌ ద్వారా ఫొటో తీసి పెట్టారు. అయితే ఉదయం 9 నుంచి ఓపీ చూడాలని ఆదేశాలున్నాయి. కాగా డాక్టర్‌ లేని కారణంగా పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సులే వైద్యం చేసి మందుబిల్లలు ఇచ్చి పంపారు.

చిత్తూరు నగరం టెలిఫోన్‌ కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ డాక్టర్‌పై ఓ స్టాఫ్‌ నర్సు ఫిర్యాదు చేసింది. డాక్టరు కేంద్రంలో ఉన్నప్పుడు కూడా మమల్ని ఓపీ చూడాలని ఇబ్బంది పెడుతున్నట్లు నోటిమాటగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఆ డాక్టర్‌కు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement