పార్కింగ్ ఫీజుకు బ్రేక్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని వాహనాల పార్కింగ్ ఫీజుకు బ్రేకు పడింది. సాక్షి దినపత్రికలో నవంబర్ 25వ తేదీన ధర్మా స్పత్రిలో ఏమిటీ దౌ ర్బాగ్యం అనే పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేశారు. జనవరి 1 నుంచి పార్కింగ్ ఫీజు ను ఎత్తివేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పార్కింగ్ గేటు వసూళ్లకు బ్రేకులు వేశారు.
వైద్య శాఖలో
ఆ అధికారి బదిలీ ?
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఓ అధికారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధ మైందనే విమర్శలు వస్తున్నాయి. శాఖలో ఓ అధి కారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బదిలీలు, పోస్టుల భర్తీ, కార్యాలయ నిర్వహణ, పలు కార్యక్రమాల నిర్వహణలో పెద్ద ఎత్తున ఆరోపణలు మూట కట్టుకున్నారు. అనతి కాలంలోనే శాఖలోని 90 శాతం మంది ఆ అధికారికి గిట్టని వాళ్లయ్యారు. కొంత మంది తమ తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఆ అధికారికి వద్ద ఊసరవెల్లులా ఉంటున్నారు. అయితే కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా..టక్కుమని రాష్ట్ర శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఉప్పందిస్తున్నారు. దీనికితోడు రాత పూర్వకంగా పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పై రాష్ట్ర శాఖ, జిల్లా యంత్రాంగం సైతం ఎప్పటి కప్పుడు గోప్యంగా విచారిస్తోంది. ఇటీవల జిల్లా కు వచ్చిన ఓ రాష్ట్ర శాఖ అధికారి సైతం ఆ అధికా రి తీరును పసిగట్టినట్లు తెలుస్తోంది. వస్తున్న ఫిర్యాదులను పలువురితో పంచుకున్నారనే విష యం బయటకొచ్చింది. త్వరలో బదిలీ ఉంటుందని రాష్ట్ర అధికారి చెప్పడంలో కార్యాలయంలో 95శాతం మంది కూల్ అయ్యారు. ఇక కార్యాలయంలో ఎప్పడు లేనంతగా ఫైళ్లు చకచకా కదలడంతో...మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. జిల్లా విభజనలో అధికారికి బదిలీ తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ అధికారి మాత్రం నన్ను బదిలీ చేసే పరిస్థితి లేదని ధీమాతో ఉన్నారు.
ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఐటీఐ రెండేళ్ల కోర్సులో 60 శాతం మార్కులు ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల 5 లోగా ఆధార్ , రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పదో తరగతి జిరాక్స్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవా లన్నారు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 4వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నమన్నారు. శిక్షణ కాలంలో ఎటువంటి భత్యం చెల్లించరని సృష్టం చేశారు.
పార్కింగ్ ఫీజుకు బ్రేక్


