వైకుంఠ ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు
కాణిపాకం : వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం రోజున శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనంలో లోటు లేకుండా చూస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషా ర్ డూడీ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్ల పై శనివారం వారు సమీక్ష నిర్వహించారు. వారితో పాటు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఈవో పెంచలకిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు కలసి వివిధ ప్రభుత్వ శాఖలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు వస్తారన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆల య అధికారులను ఆదేశించామన్నారు. డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల సంవత్సరాది జనవరి 01వ తేదీలలో సుమారు 60 వేల మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తు ల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ మూడు రోజులు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామన్నారు. ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫి క్ సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్ సంబంధించి స్థలం పరిశీలించామన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మె ల్యే, ఈవో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, వరుస సెలవులు రావడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీ పెరిగినా భక్తులకు సౌకర్యవంతమై న దర్శనం కలిగించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉదయం 2 నుంచి నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉభయదారులకు దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుందన్నారు. జనవరి 1న ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనం రద్దు చేశామని, రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులు నిరాటంకంగా స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు.


