ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం బీసీ కాలనీ మలుపులో ఎస్‌ఆర్‌పురం ఏఎంసీ చెర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెరకు తోటలో బోల్తా పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కేజే పురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఆర్‌పురం ఏఎంసీ చెర్మన్ జయంతి గుండయ్య కారు మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారు పైకప్పు నుజ్జునుజ్జు అయినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. కొందరు యువకులు పోలీసులు రాకముందే తోటలోని కారును బయటికి తీశారు. పోలీసులు ఏఎంసీ చెర్మన్ కారు అనడంతో వారు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.


