యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణ సమీపంలోని టి.వడ్డూరు గ్రామ సమీపంలోని ఓ ఇంట్లో ఓ యువకుడు అనుమా నాస్పదంగా మృతి చెందిన ఘటన శనివా రం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా మండలంలోని నూనేవారిపల్లికి చెందిన జితేంద్ర (26)గా గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమి కంగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజుల కిందట ఇంట్లో గొడవపడి ఇంటి నుంచి ఇటువైపు వచ్చినట్టుగా సమాచారం. కాగా అతడి సోదరుడు సైతం కోతిగుట్ట హత్యాయత్నం కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టు అయిన విషయం తెలిసిందే. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
యువకుడి ఆత్మహత్య
కుప్పంరూరల్ : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండలం, నూలుకుంటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. నూలుకుంట గ్రామానికి చెందిన కాళీ (35) ఇటీవల ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా నిత్యం కుటుంబంలో కలహాలు చోటు చేసుకునేవి. శనివారం సాయంత్రం కాళీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కల్లు గీత కార్మికుడిగా పని చేసే కాళీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మహిళపై యువకుడి దాడి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం వేమాపురం గ్రామానికి చెందిన కిషోర్ (24) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ అనే మహిళపై శనివారం దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరీష్ తెలిపారు.
చోరీకి విఫలయత్నం
పుత్తూరు : పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే వరుసగా మూడు దొంగతనాలు జరగ్గా 105 గ్రాముల బంగారు నగ లు, 400 గ్రాముల వెండి ఆభరణాలను దుండగు లు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము 2–30 గంటల ప్రాంతంలో స్థానిక నగరం రోడ్డులోని సూర్య ఎలక్ట్రికల్ దుకాణంలోకి ఓ దుండగు ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. రాడ్ ను ఉపయోగించి రెండు తాళాలు విరగొట్టిన దొంగ మూడవ తాళం తొలగించలేకపోయాడు. దీంతో వెనుదిరిగాడు. ఉదయం షాపు వద్ద జరిగిన దొంగతనం ప్రయత్నాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ చిత్రాల ఫుటేజీని అందజేశాడు. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి


