బాలికను మోసం చేసిన యువకుడు అరెస్టు
పాలసముద్రం : మండలంలో ఓ బాలికను గర్భిణిగా చేసిన యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు శనివారం నగరి డీఎస్పీ మహమద్ అజీజ్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ ఇందిరానగర్ ఆదిఆంధ్రవాడ గ్రామానికి చెందిన దినేష్ (19) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక శరీరర మార్పులను గమనించి ప్రశ్నించడంతో విషయం వారికి తెలియజేసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దినేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


