వెంకన్న దర్శనానికి వెళ్తూ..
చౌడేపల్లె: పుంగనూరు మండలం, ప్రసన్నయ్యగారి పల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు(62) తిరుమలకు పాదయాత్రగా వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. ప్రసన్నగారిపల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు గ్రామస్తులతో కలిసి ప్రతి యేటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. ఈక్రమంలో గురువారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి కాలినడకన వెళ్తుండగా చౌడపల్లె పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని పెద్దయల్లకుంట్ల వద్ద పుంగనూరు నుంచి చౌడేపల్లెకు వెళ్తున్న ఓ స్కూటర్ ఢీకొంది. శ్రీరాము లు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బైక్‌తోపాటు ఆమినిగుంటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


