టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

Dec 30 2025 7:40 AM | Updated on Dec 30 2025 7:40 AM

టిప్ప

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

గుడిపాల: టిప్పర్‌ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం ఉదయం 189 కొత్తపల్లెకు చెందిన నేషన్‌(55) రోడ్డు దాటుతుండగా వేలూరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తున్న ఓ టిప్పర్‌ లారీ ఢీకొని వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నాలుగు టిప్పర్లు సీజ్‌

నగరి : ఓవర్‌లోడ్‌తో వెళుతున్న నాలుగు టిప్పర్లను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ రవికుమార్‌ తెలిపారు. అధిక లోడ్‌ టిప్పర్ల కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నట్లు ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఆర్డీవో సూచనల మేరకు సోమవారం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సహకారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తుతున్న నాలుగు టిప్పర్లను సీజ్‌ చేసి రూ. 91,120 జరిమానా విధించామన్నారు. సీజ్‌చేసిన వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తరచూ తనఖీలు నిర్వహిస్తామని బిల్లుల్లో తేడా వచ్చినా, ఓవర్‌ లోడ్‌ అని తేలినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాణిపాకంలో ప్రముఖులు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి క్షేత్రం సోమవారం ప్రముఖులతో సందడిగా కనిపించింది. పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వామి సన్నిద్ధికి వచ్చారు. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి నీరజ్‌ తివారీ, పాట్నా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణారెడ్డి, పుల్లా కార్తీక్‌, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ ఎస్‌కినాగి , సందేశ్‌, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, తెలంగాణ రాష్ట్ర ఆర్టీ కమిషన్‌ శ్రీనివాసులురావు, తెలంగాణ రాష్ణ్ర గవర్నర్‌ సతీమణి సుధాదేవ్‌ వర్శ, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, హిందూపురం ఎంపీ పార్థసారథితో పలువురు ఎమ్మెల్యేలు దర్శించున్నారు. వీరికి ఆలయ ఈవో పెంచలకిషోర్‌, చైర్మన్‌ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు అతిథి మర్యాదలు చేశారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

చిత్తూరు రూరల్‌ (రూరల్‌): జిల్లాలోని ఎరువుల దుకాణాలను సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ తనిఖీ బృంద అధికారులు పరిశీలించారు. బంగారుపాళ్యం, వి.కోట, బైరెడ్డిపల్లి, కుప్పం మండలాల్లోని పలు దుకాణాలను బృందం అధికారులు సునీల్‌, మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, సాలురెడ్డి, వెంకటేశ్వరు తనిఖీ చేశారు. ఎరువులు, క్రయ విక్రయాలపై క్షుణంగా పరిశీలించారు. ఎరువుల నిల్వలను లోతుగా విచారించారు. ఈ తరుణంలో బిల్లులు సక్రమంగా లేని కారణంగా...రూ.15 లక్షల విలువ చేస 60 మెట్రిక్‌ టన్నుల యూరియాను గుర్తించారు. ఈ తనిఖీ మరో రెండు రోజుల పాటు సాగనుందని వ్యవసాయశాఖ ఆధికారులు తెలిపారు.

నేడు జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం

చిత్తూరు కార్పొరేషన్‌: జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. ఉదయం 10.30కు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలైన ఆర్థిక, ప్రణాళిక, పనులు, గ్రామీణభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాల పై చర్చ ఉంటుందన్నారు. అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి 
1
1/4

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి 
2
2/4

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి 
3
3/4

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి 
4
4/4

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement