అట్టహాసంగా చదరంగం పోటీలు
కల్యాణ వెంకన్న ఆలయం వద్దసప్తద్వారాల ఏర్పాటు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఆర్కే పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఓపెన్ చెస్ టోర్నీ అట్టహాసంగా సాగింది. ఈ టోర్నీలో ఏపీ చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో చదరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొత్తం 11 కేటగిరీల్లో సాగిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలు నిలిచారు. గెలుపొందిన వారికి రూ.1.29 లక్షల విలువైన నగదు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విజేతలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు అందజేశారు. కార్యక్రమంలో చెస్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబుప్రసాద్‌రెడ్డి, పాఠశాల నిర్వాహకులు రవీంద్ర, కోమల, చెస్ సంఘం సభ్యులు దినేష్, కిశోర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా చదరంగం పోటీలు
అట్టహాసంగా చదరంగం పోటీలు


