పునర్విభజనం.. అసంబద్ధం | - | Sakshi
Sakshi News home page

పునర్విభజనం.. అసంబద్ధం

Dec 30 2025 7:40 AM | Updated on Dec 30 2025 7:40 AM

పునర్

పునర్విభజనం.. అసంబద్ధం

చిన్న జిల్లాగా మారిన చిత్తూరు రాజకీయ కక్షతో పుంగనూరు అన్నమయ్యలోకి.. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు మాత్రం చిత్తూరులోనే.. తిరుపతి జిల్లాలోకి కోడూరు నియోజకవర్గం గూడూరులోని మూడు, వెంకటగిరిలోని మూడు మండలాలు నెల్లూరులోకి వాకాడు, చిట్టమూరు మండలాలు మాత్రం తిరుపతి జిల్లాలోకి నియోజకవర్గాల మార్పులు..చేర్పులపై అసంతృప్తి

జిల్లాల పునర్విభజన అసంబద్ధంగా జరిగింది. టీడీపీకి అనుకూలంగా మండలాలను ఒకటిగా చేసి, వైఎస్సార్‌సీపీకి పట్టున్న మండలాలు, నియోజకవర్గాలను ముక్కలు ముక్క లుగా చేసింది. వేర్వేరు జిల్లాల్లోకి కలిపివేసింది. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న నిపుణుల హెచ్చరికలను సైతం తోసిపుచ్చింది. టీడీపీ అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇక్కట్లుపడక తప్పదని మేధావులు చెబుతున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాల పునర్విభజన చేపట్టారనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు ప్రభుత్వం నియోజక వర్గాలను చిందర వందరగా చేసింది. అసెంబ్లీ ఒకటైతే.. ఆ నియోజక వర్గ పరిధిలోని మండలాలను మరో జిల్లాలోకి చేర్చి గందరగోళానికి తెరతీశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్ని మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉండడం, ఆ నియోజక వర్గం ఒకే జిల్లాలో ఉంటేనే పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల స్వరూపాన్నే మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు అని చెబుతూ.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం జిల్లాల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ మార్పులు చేర్పుల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షతోనే పుంగనూరు నియోజక వర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను విడగొట్టడంతో నాలుగు డివిజన్లు, 28 మండలాలతో చిత్తూరు చిన్నదిగా మారిపోయింది.

గందరగోళంగా తిరుపతి జిల్లా..

తిరుపతి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాలు ఉండేవి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోకి కొత్తగా కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలుపుతూ కాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు, గూడూరు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి కలిపారు. ఇదే గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను మాత్రం తిరుపతి జిల్లాలోనే ఉంచారు. అలాగే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు డివిజన్లు, 36 మండలాలను తిరుపతి జిల్లాగా ప్రకటించారు. ఇలా చేయడంతో ప్రతి ఎన్నికల్లోనూ, పాలనాపరమైన సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తిరుపతి జిల్లా

పునర్విభజనం.. అసంబద్ధం1
1/2

పునర్విభజనం.. అసంబద్ధం

పునర్విభజనం.. అసంబద్ధం2
2/2

పునర్విభజనం.. అసంబద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement