శాంతి భద్రతలపై దిశానిర్దేశం
సదుం : పోలీసు స్టేషన్‌ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయనకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహీంద్ర స్వాగతం పలికి, గౌరవ వందనం చేశారు. స్టేషన్‌లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అన్నమయ్య జిల్లా పరిధీలోకి చౌడేపల్లె సర్కిల్ చేరడంతో పరిస్థితుల అవగాహన కోసం సాధారణ తనిఖీ చేపట్టారు. కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్, చౌడేపల్లె ఎస్‌ఐ నాగేశ్వర రావు, ఏఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
చల్లా ఇంటికి..
రొంపిచెర్ల : పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి కర్నూల్ రెంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఉదయం వచ్చారు. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీలోని గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కొంత సేపు ముచ్చటించి వెళ్లారు. అనంతరం నియోజక వర్గంలోని సోమల, చౌడేపల్లె, పుంగనూరు పోలీసుస్టేషన్లును డీఐజీ తనిఖీ చేశారు.
జిల్లాలో పెద్ద రెవెన్యూ డివిజన్ పాయె!
ఆలయాల భద్రత గాలికి
తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తు లపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కి, పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
పలమనేరు : పలమనేరు కొత్త రెవెన్యూ డివిజన్‌గా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అవతరించింది. 2022 ఏప్రిల్‌లో పలమనేరులో డివిజన్ కార్యాలయ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోనే పలమనేరు వైశాల్యంలో పెద్ద డివిజన్‌గా మారింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని ఎటూ కాకుండా చేసేశారు. పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని పుంగనూరు, చౌడేపల్లి మదనపల్లి డివిజన్‌లోకి, బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి, సోమల, సదుం మండలాలను పీలేరు డివిజన్‌లోకి విలీనం చేసేశారు. దీంతో పలమనేరు రెవెన్యూ డివిజన్ కేవలం ఐదు మండలాలకే పరిమితమైంది. ఫలితంగా విస్తీర్ణంలోనూ తగ్గి పెద్ద డివిజన్ పేరును పోగొట్టుకుంది. పలమనేరుపై ఇంత కక్ష జరుగుతున్నా దీనిపై పాలకులు నోరు మెదపకపోవడంపై జనంలో విమర్శలు వినిపిస్తున్నాయి.
శాంతి భద్రతలపై దిశానిర్దేశం
శాంతి భద్రతలపై దిశానిర్దేశం


