ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్, విభిన్న ప్రతిభావంతులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ట్రాన్స్‌జెండర్స్, విభిన్న ప్రతిభావంతులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా పోటీ పరీక్షలు, స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్‌లోని విభిన్న ప్రతిభావంతుల శాఖలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08572–296506 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
బాధ్యతల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సైన్స్ అధికారి (డీఎస్‌వో) మోహన్‌సింగ్ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన ఆయనను జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. దీంతో సైన్స్ అధికారి పోస్టు ఖాళీ ఏర్పడింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, లింగాపురం జెడ్పీ హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మో హన్‌సింగ్‌ను జిల్లా సైన్స్ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ–సంజీవనిని
సద్వినియోగం చేసుకోవాలి
– చిత్తూరు డీఎంహెచ్‌ఓ సుధారాణి
చౌడేపల్లె: స్థానిక ప్రభుత్వాస్పత్రిని చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌ఓ సుధారాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈ–సంజీవనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమం ద్వారా రోగి ఆరోగ్య స్థితిగతులను ఆన్‌లైన్‌లో పొందుపరచడం యూనిక్ ఐడీ ద్వారా ఎప్పటికప్పుడు వైద్యసేవ లు, జాగ్రత్తలు తెలిపేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం లద్దిగంలో ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పా టు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయితే స్థలం ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా చూపాల్సి ఉందన్నారు. మరో సారి జిల్లా కలెక్టర్‌కు స్థలం విషయమై నివేదిస్తామన్నారు. ఆమె వెంట డాక్టర్ మోనా ఉన్నారు.
సైన్స్‌లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు
చిత్తూరు కలెక్టరేట్ : సైన్స్‌లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయ శిక్ష ణ అవసరాల విశ్లేషణ (టీఎన్‌ఏ) ఆధారంగా మాధ్యమిక పాఠశాల సైన్స్ టీచర్లకు శిక్షణ కోర్సు అమలు చేయనున్నారు. టీఎన్‌ఏ ప్రక్రి యలో ఎంపిక చేసుకున్న టీచర్లకు శిక్షణ ఇవ్వ నున్నారు. ఈ శిక్షణకు జిల్లాలో డీఆర్‌పీ, మండలాల వారీగా ఎంఆర్‌పీలను ఎంపిక చేసి జాబితాను విడుదల చేశారు. ఈ శిక్షణ నిర్వహణ విధి విధానాలు, ఆన్‌లైన్ కోర్సుల పూర్తి షెడ్యూల్‌ను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నామినేషన్ల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్‌లో అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ టూరి జం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు విజయవాడలో వర్క్‌షాప్ ఉంటుందన్నారు. అవకై ్క అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ వర్క్‌షాప్ విజయవాడలోని భవానీ ద్వీపంలో జరుగుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ఆసక్తి ఉన్న మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు (కరా టే, థైక్వాండో, జూడో, కుంగ్‌ఫూ తదితర) ఈ నెల 5వ తేదీలోపు నామినేషన్లు పంపాలన్నా రు. ఇతర వివరాలకు 9989345777, 9491504449 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ఉచిత శిక్షణ


