ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మంగళవారం సంకటహర చ తుర్థి గణపత్రి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఉత్స వ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సా యంత్రం 5 నుంచి 6గంటల వరకు చతుర్థి గణపతి వ్రతాన్ని జరిపించారు.
స్వర్ణ రథంపై స్వామివారు
వరసిద్ధి వినాయకస్వామి వారు రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు అర్చక, ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
వ్రతంలో భక్తులు (ఇన్‌సెట్) ఊరేగుతున్న స్వామివారు


