పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ వివిధ సంస్థల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగులకు అందే పెన్షన్ ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాజమాన్యాలకు, సంస్థలకు ఎంప్లాయీస్ ఎన్రోల్‌మెంట్ పథకం, ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకంలో ఉద్యోగులు నమోదు కావాలన్నారు. ఈ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సామాజిక భద్రత అర్హత కలిగిన ఉద్యోగులు వారు చేరిన తేదీ నుంచి ఉద్యోగుల భవిష్యనిధి పథకం, ఉద్యోగుల పెన్షన్ పథకం, ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్‌లో సామాజిక భద్రత ప్రయోజనాలు పొందుతారన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


