నేటి నుంచి ఆధార్ శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలు తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల అప్డేట్‌కు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లాలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సినవారు 18 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికోసం గ్రామ/వా ర్డు సచివాలయాల్లోని 125 కేంద్రాల్లో పిల్లలు తమ ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆల యం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. కోరిన కోర్కె లు తీర్చే గంగమ్మా .. దీవెంచమ్మా అంటూ వేడుకున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చా రు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారి దర్శనం కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అఽధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం రద్దీతో క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కి రిసి పోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసా దాలను పంపిణీ చేశారు.
200 లీటర్ల బెల్లం
ఊట ధ్వంసం
కార్వేటినగరం : సారా తయారీ అమ్మకాలు జరిపితే కఠిన శిక్ష తప్పదని ఎస్‌ఐ తేజస్విని అన్నా రు. ఆదివారం మండల పరిఽధిలోని కనికాపురం సమీపంలో దాడులు నిర్వహించి సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మండలంలో కొటార్వేడు, గోపిశెట్టిపల్లి, కనికాపురం,కృష్ణసముద్రం, వంటి పలు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం కనికాపురం సమీపంలో కృష్ణాపురం జలాశయం సప్‌లై చానల్‌లో అక్రమంగా దాచి ఉంచిన ఊట, సారా తయారీకి వినియోగించే పరికరాలను ధ్వంసం చేశారు. కానిస్టేబుల్ రాజశేఖర్, రాజ ఉన్నారు.
బ్రెయిలీ విగ్రహావిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలోని కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బ్రెయిలీ విగ్రహం వద్ద జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమం ఏర్పా టు చేశారు. నిర్వహణకు నిధులు మంజూరు అవుతున్నప్పటికీ జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమాన్నితూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. అంధులకు, సంఘ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులు అవమానం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులను పక్క దారి పట్టించేందుకు ఇలాచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ తప్పనిసరి
తిరుపతి లీగల్ : తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలల్లో రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరిగా సీఎం చంద్రబాబు కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో బీసీలకు చట్ట సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రిజర్వేష్లకోసం బీసీ సంఘాల తరఫున హైకోర్టులో రిట్ దాఖలు చేశామని, సోమవారం విచారణ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చంద్రబాబు సర్కార్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోందని, రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల : వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ట్రస్ట్ తరఫున ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి చెక్ అందజేశారు.
నేటి నుంచి ఆధార్ శిబిరాలు
నేటి నుంచి ఆధార్ శిబిరాలు


