నేటి నుంచి గ్రామసభలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పలు పంచాయతీల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు అంశాల పై చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ వికసిత్ భారత్ వీబీ జీ రామ్ జీని తీసుకొచ్చింది. ఈ నూతన పథకం మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏక కాలంలో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. జాబ్‌కార్డు కలిగిన వారికి ఏడాదికి గరిష్టంగా ఇప్పటి వరకు వంద రోజుల పని కల్పిస్తుండగా ఇకపై 125 రోజులు కల్పించనున్నారు. పరిపాలనా వ్యయం ఇప్పటి వరకు 6శాతం ఇస్తుండగా దానిని 9 శాతానికి పెంచారు.
పలు అంశాల పై చర్చ
గ్రామసభలో పలు అంశాల పై చర్చించనున్నారు. వీబీ జీ రామ్ జీ పథకంలో మార్పులు, అమలు, స్వచ్ఛ గ్రామాల పేరుతో సంక్రాంతి లోపు అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తారు. అలాగే స్వర్ణ పంచాయతీ యాప్ అమలు, పన్నుల చెల్లింపు స్వామిత్వ మూడో విడత సర్వేపై వివరించనున్నారు.
– సుధాకర్‌రావు, డీపీఓ


