నకిలీ నోట్ల చలామనీ
కుప్పం : మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతమైన కుప్పం కేంద్రంగా నకిలీ నోట్లు చలామనీ విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధానంగా 500 రూపాయల నోటు చూస్తేనే వ్యాపారులు హడలిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా చిల్లర , పాల వ్యాపారులు దుకాణాల్లో 500 నకిలీ నోట్లు జోరుగా చలామని అవుతున్నాయి. కుప్పం ప్రాంతం మూడు రాష్టాల కూడలి కావడంతో అక్రమ వ్యాపారాలకు అనువుగా మారింది. కర్ణాటక రాష్ట్రం 10 కిల్లో మీటర్లు, తమిళనాడు 10 కిల్లో మీటర్లు దూరంలో ఉన్నాయి. కుప్పం కేంద్రంగా కర్ణాటక రాష్ట్రం కోలార్, కేజీఎఫ్ నుంచి తమిళనాడు చేరిన సేలం, కోయంబత్తూరు , దర్మపూరి పట్టణాల నుంచి నకిలీ నోట్లు జోరుగా సరఫరా జరుగుతున్నట్లు తెలిసింది. కుప్పం మీదుగా నకిలీ నోట్లు సరఫరా చేస్తూ కుప్పంలోనూ 500 నకిలీ నోట్లు చలామనీ చేస్తున్నారు.
ఒకే దుకాణంలో నాలుగు నకిలీ నోట్లు
పట్టణం ప్యాలెస్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఓ పాల దుకాణంలో ఒకే రోజు నాలుగు నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన డబ్బును చలాన కట్టేందుకు బ్యాంకుకు వెళ్తే నాలుగు 500 రూపాయిల నోట్లు బ్యాంక్ అధికారులు రిజక్ట్ చేశారు. దీంతో పాల వ్యాపారి షాక్‌కు గురయ్యాడు. నిత్యం ఇలా ఒకటి రెండు 500 నకిలీ నోట్లు వస్తున్నాయని పాల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో అక్రమ రవాణాపై నిఘా కొరవడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు అధికారులు రిజక్ట్ చేసిన 500 నకిలీ కరెన్సీ
కుప్పంలో చలామనీ అవుతున్న నకిలీ నోట్లు
నకిలీ నోట్ల చలామనీ


