కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Jan 4 2026 10:52 AM | Updated on Jan 4 2026 10:52 AM

కేజీబీవీల్లో  నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

● రూ.2.80 లక్షలు విలువ చేసే వస్తువు బహూకరణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. జిల్లాలోని 5 కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 34 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ అభ్యర్థులకు 18–45 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరా లు, దివ్యాంగులకు ఏడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులను కేజీబీవీ ప్రిన్సిపల్స్‌, ఎంఈఓల వద్ద పొందవచ్చని చెప్పారు. ఈ పోస్టులకు జిల్లాలో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 11వ తేదీ లోపు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఉన్న సమగ్ర శిక్ష శాఖలో అందజేయాలని ఆయన వెల్లడించారు.

బోయకొండ గర్భాలయానికి ఇత్తడి తాపడం సమర్పణ

చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ప్రధాన గర్భాలయంలో అమ్మ వారి విగ్రహానికి వెనుక అలంకరణ కోసం ఇత్తడి తాపడాన్ని శనివారం విరాళంగా అందజేసినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. మదనపల్లె టౌన్‌ ఎస్బీఐ కాలనీకు చెందిన పి.గంగాధరం సుమారు రూ.2.80 లక్షలు విలువ చేసే ఇత్తడి తాపడం షీట్‌ తయారు చేయించి ఆల యంలో అలంకరణ కోసం విరాళమిచ్చారు.

వడ్డీ మాఫీ అవకాశాన్ని

సద్వినియోగం చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణాలపై వడ్డీమాపీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విక్రమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరి ధిలో 2015–16 నుంచి 2018–19లో మంజూరు చేసిన ఎన్‌ఎస్‌ఎఫ్‌ దీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పించిందన్నారు. నాలు గు నెలల (ఏప్రిల్‌ 2026)లోపు అస లు రుణ మొత్తం చెల్లిస్తే, 2025 ఆగస్టు 31 వరకు ఉన్న మిగిలిన వడ్డీని మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని అంబేడ్కర్‌ భవనంలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 83,032 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,272 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శ నం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement