చతికిల‘బడి’
మూసివేతకు...
బాబు సర్కారు కుట్ర !
ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయకపోగా మూసివేతకు చంద్రబాబు సర్కారు చర్యలు చేపడుతోంది. 2019కి ముందు రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే విలీనం పేరుతో పాఠశాలలను కనుమరుగుచేశారు. తాజాగా తక్కువ విద్యార్థుల సాకుతో మరిన్ని పాఠశాలలను మూసివేతకు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా.. తగినంత మంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి రెండు రోజుల కిందట అన్ని జిల్లా లు, మండలాల విద్యాశాఖాధికారులతో వెబెక్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదులోపు ఉన్న ఫౌండేషన్‌న్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం.
బడులకు తాళం కార్టూన్ చిత్రం
పాఠశాలలో పాఠాలు చెబుతున్న టీచర్ కార్టూన్ చిత్రం
నియోజకవర్గం పాఠశాలల విద్యార్థుల
సంఖ్య సంఖ్య
చిత్తూరు 183 11,413
గంగాధరనెల్లూరు 399 15,139
కుప్పం 433 31,955
నగరి 177 10,334
పలమనేరు 463 33,327
పూతలపట్టు 355 15,642
పుంగనూరు 404 22,856
మొత్తం 2414 1,40,666
ఇది జిల్లాలో పరిస్థితి
జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని పలు పాఠశాలలను తక్కువ విద్యార్థుల సాకుతో మూసివేతకు రహస్యంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కసరత్తు నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదికలు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లా సమాచారం
చతికిల‘బడి’


