టమోతనారు
గత సంవత్సర కాలంగా టమాట ధరలు పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతూ వచ్చాయి. నెల రోజులుగా టమాట ధరలు పుంజుకోవడంతో రైతులు మళ్లీ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టమాట కిలో ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. రేటు రావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. .దీంతో అందరూ టమాట నారు కోసం నర్సరీల చుట్టూ తిరుగుతుండడంతో నారుకు గిరాకీ పెరిగింది. నెల రోజుల వరకు నర్సరీల్లో కూడా నారు దొరకని పరిస్థితి రావచ్చని కొంత మంది రైతులు అభిప్రాయపడుతున్నారు.
– పులిచెర్ల (కల్లూరు)


