మన్నిక, నాణ్యతకు ప్రతీకగా భారతి సిమెంట్
నాయుడుపేట టౌన్: మన్నిక, నాణ్యతలకు ప్రతీక భారతి సిమెంట్ అని, ఇది అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోందని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి పాస్టర్ ఆదర్ష్ ప్రీతం కొనియాడారు. నాయుడుపేటలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వద్ద ఆ సంఘం పెద్దలు యువతతో కలిసి పాస్టర్ కేక్ కట్ చేసి భారతి సిమెంట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ వేడకలను భారతి సిమెంట్స్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారతి సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. భారతి సిమెంట్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిప్యూటీ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చైర్మన్ కారల్ మధు, కేఎంవీ కళాచంద్ర, సండే స్కూల్ సూపరిండిండెంట్ ప్రేమ్‌చంద్, భారతి సిమెంట్స్ డీలర్లు కామిరెడ్డి అమరేంద్రరెడ్డి, కరీంబాయి, చెంచయ్య మొదలియార్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు బెన్‌హర్, కాళహస్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు.


