కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆలయ పునఃనిర్మాణ దాతలు, వెండి వాకిలి, బంగారు వాకిలి దాత లు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ ఉన్నారు. వీరికి ఈవో పెంచల కిషోర్, ఆలయ బృందం ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. పండితుల ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు.
రాష్ట్ర స్థాయి
బేస్ క్యాంప్‌నకు ఎంపిక
రొంపిచెర్ల: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ ఎంపికై నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం తిరుపతిలో జరిగిన జోనల్ లెవల్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. రొంపిచెర్ల బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడని తెలిపారు. విక్రాంత్ ఎంపికకు కృషి చేసిన భవిత పాఠశాల ఉపాధ్యాయులు అములు, మానసను అభినందించారు. త్వరలో విజయవాడలో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పాల్గొంటారని ఎంఈవో తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
గుడిపాల: తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డులోని రెట్టగుంట ఫ్‌లైఓవర్ వద్ద వేచి ఉన్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో చిత్తూరు రూరల్ మండలం, మాపాక్షి గ్రామానికి చెందిన అరుణ్(45) అనే వ్యక్తి ద్విచక్ర వాహ నంలో బియ్యాన్ని తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా తక్కువ రేటుకు కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్ముకుంటున్నట్లు తెలిపాడన్నారు. అతని వద్ద ఉన్న 250 కిలోల బియ్యాన్ని సీజ్ చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
పల్లెలు శుభ్రంగా ఉండాలి
చిత్తూరు కార్పొరేషన్: పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలు శుభ్రంగా ఉంచాలన్నారు. వచ్చే నెల 15లోపు స్వచ్ఛరథం సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం పాత రేషన్ సరఫరా వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు.
కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకంలో పలువురు ప్రముఖులు


