మారథాన్‌లో సీఐ రికార్డు
పలమనేరు : చైన్నె రన్నర్స్ సంఘం ఆధ్వర్యంలో చైన్నెలో ఫ్రెస్ వర్క్స్ ఆధ్వర్యంలో 21.97 కిలో మీటర్ల మారథా న్ పరుగు పందెం పోటీల్లో తిరుపతి పీటీసీ (పోలీస్ ట్రైనింగ్ సెంటర్)కు చెందిన సీఐ మధుసూధన్‌రెడ్డి గంటా 57 నిమిషాల్లో పూర్తిచేసి రికార్డ్ నెలకొల్పారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన మధుసూధన్‌రెడ్డి కొన్నేళ్లుగా నడక, పరుగు పోటీల్లో పాల్గొంటూ పలు పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో చైన్నెలో ఆదివారం జరిగిన మారథాన్‌లో విజేతగా నిలిచి అక్కడి నిర్వాహకులచే ప్రశంసంతో పాటు మెడల్‌ను సాధించారు.
టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ రాంగణేష్ మృతి
చిత్తూరు కార్పొరేషన్ : మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు రాంగణేష్ (45) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని మురకంబట్టుకు చెందిన ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన ఆయన శబరిమలకు వెళ్లారు. ఆదివారం సన్నిధానంకు కిలోమీటరు దూరం ఉండగా కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్న రాంగణేష్ అలాగే వాలిపోయాడన్నారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందారన్నారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు మెతీష్, నితీస్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు.
మారథాన్‌లో సీఐ రికార్డు


