రైతుల పాట్లు
మామిడి తోటల్లో అరకొరగా పూసిన పూత ఆపేందుకు ఓ వైపు, కొత్తగా పూత వచ్చేందుకు మరో వైపు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పూత రసం పీల్చే నల్లి, పూతను తొలిచే పురుగు ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఖర్చు చేస్తూ మూడు విడతులుగా మందులు పిచికారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి పూత వస్తే ఎకరానికి 5 టన్నుల దిగుబడి లభిస్తుందంటున్నారు. కానీ ఇంత వరకు పూత కనిపించపోవడంతో ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు కొలుకోవడం కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు.


