మా భూమి వ్యవహారంలో వారి పెత్తనమా.?
నా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిలో మా కుటుంబంలో ఏమైనా తగరార్లుంటే మేం చూసుకుంటాం. కానీ అధికార పార్టీ నాయకులు ఆర్‌డీవోకు చెప్పి మా భూములను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఏంటి. నా ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన డబ్బులు రాకుండా పోయాయి. దీనికి కారణం కూటమి నాయకులే. మా భూమిపై వీరి పెత్తనం ఏంటి. తనకు న్యాయం కావాలనే ఆర్‌డీవో వద్దకొచ్చా. – పరిమళ, బాధితురాలు
దీనిపై విచారించి న్యాయం చేస్తాం
పరిమళ అనే బాధితురాలు తన సమస్యను తెలుపుకుంది. కోర్టు కేసులో ఉన్న ఆస్తిపై బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని చెప్పింది. దీనిపై పుంగనూరు తహసీల్దార్ ద్వారా విచారించి ఆమెకు న్యాం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందులో రాజకీయ ప్రమేయం లేదు. దీనిపై మానవతా హృదయంతో బాధితురాలికి న్యాయం చేస్తాం.
– భవాని,ఆర్‌డీవో, పలమనేరు
మా భూమి వ్యవహారంలో వారి పెత్తనమా.?


